భానుపురి (సూర్యాపేట) : వివిధ ఉద్యోగాలు సాధించిన యువతీయువకులు సేవాభావం కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన వారికి శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ నియామక పత్రాలు అందించి మాట్లాడారు. అదేవిధంగా సెకండ్ ఎడ్యుకేషన్ సీఎం కప్ 2025లో భాగంగా చెస్‌లో రాష్ట్ర స్థాయి మెడల్ సాధించిన ఓరుగంటి అనంతలక్ష్మిని సన్మానించి రూ.5వేల నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు.


