మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


