సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు | - | Sakshi
Sakshi News home page

సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు

Mar 23 2026 7:04 AM | Updated on Mar 23 2026 7:04 AM

అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్‌, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరి పారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్‌, గణపురం నరేష్‌, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.

24న కలెక్టరేట్‌ ఎదుట నిరసన

సూర్యాపేటటౌన్‌ : ఈ నెల 24న కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించలేదని విమర్శించారు. పీఆర్‌సీ ఫిట్మెంట్‌ వెంటనే ప్రకటించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు యాకయ్య, సుభాని, రమేష్‌, లాలయ్య, హనుమంత్‌, మల్లికార్జున్‌, సాల్మన్‌, మహేష్‌, మధు కుమార్‌, మహేందర్‌, సుధాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, నర్సయ్య, రవి కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement