నేరేడుచర్ల : కమ్య్టూనిస్టు ఆశయాల కోసం తుది శ్వాస విడిచేంత వరకు కొనసాగిన గొప్పనేత శ్రీరామయ్య అని, ఆయన జీవితం నేటి కమ్యూనిస్టులకు స్ఫూర్తి దాయకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండలం మూడారం గ్రామంలో శ్రీరామయ్య భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే భూమి కోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర నేత మల్లు లక్ష్మి మాట్లాడుతూ శ్రీరామయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు పారేపల్లి శేఖర్‌రావు, కోదమగుండ్ల నగేష్, అనంత్ ప్రకాశ్, సిరికొండ శ్రీను, పోశనబోయిన హుస్సెన్, మర్రి నాగేశ్వర్‌రావు, కట్ట మధు బాబు, నాగ సైదులు, శ్రీధర్, బాబురావు,. రాణమ్మ, జానకిరాములు, రామ్మూర్తి, హఫీజ్, నర్సింహ్మ, పాతూరి శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


