నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొడ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


