● కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పన కింద 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రాయితీలపై అందించే పథకాలను పొంది ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టర్‌లో షెడ్యూల్డ్ కులాల కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, బ్యాంకర్లతో కలెక్టర్ వెబ్‌ఎక్స్ మీటింగ్ నిర్వహించారు. ఎస్సీ యువత నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 24వ తేదీలోగా http://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కార్యనిర్వాహక సంచాలకులు దయారాణి, జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి జయప్రకాశ్‌రెడ్డి, ఎల్‌డీఎం ఎంవీఎన్ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏడీ అశోక్ వ్యవసాయ శాఖ అధికారి ప్రణవి పాల్గొన్నారు.
ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి : కలెక్టర్
ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వేడుకలను నిర్వహించాలని పేర్కొన్నారు.


