శ్రీలక్ష్మీనరసింహునికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మీనరసింహునికి విశేష పూజలు

Mar 19 2026 7:29 AM | Updated on Mar 19 2026 7:29 AM

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణంలో భాగంగా బుధవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement