పెన్‌పహాడ్ : పశు సంపదతో రైతులు లాభాలు పొందవచ్చని జిల్లా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు బి.వెంకన్న అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని జల్మాలకుంట, గూడెపుకుంట తండాల్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో పశువైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు లాభసాటి పశు పోషణ, పాడిలో అవలంభించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామానాయక్, పశువైద్యాధికారి యర్రంశెట్టి కిరణ్‌కుమార్, అనంతుల వెంకన్న, జయసుధ, రైతులు తదితరులు పాల్గొన్నారు.


