హుజూర్‌నగర్ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర ఆరంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ ఉగాది అని పేర్కొన్నారు. కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. రైతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.


