నిషేధంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

నిషేధంపై ఆగ్రహం

Mar 19 2026 7:29 AM | Updated on Mar 19 2026 7:29 AM

పేదలకు భరోసా కల్పించాలి

ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

యాదాద్రిభువనగిరి జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన ఇళ్లు, నివేశన స్థలాలను తొలగించాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం శాసనసభలో ప్రఽశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో 39400 ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908లోని సెక్షన్‌ 22 ఏలో చేర్చారన్నారు. దీంతో ఆయా ఇళ్లు క్రయ విక్రయాలు నిలిచిపోయాయన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ప్రభుత్వం వెంటనే పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితానుంచి తొలగించి పేదలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ నిషేధిత జాబితాపై ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులపై క్రిమినల్‌ కేసులునమోదు చేయాలని ఐలయ్య కోరారు.

సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా జిల్లాలో చిచ్చురేపుతోంది. నిషేధిత జాబితాలో చేర్చిన నివేశన స్థలాలు, ఇళ్లను తొలగించాలన్న డిమాండ్‌ తీవ్రమవుతోంది. దీనిని ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకొని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో పోరాడుతుండగా ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఈఅంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. జాబి తానుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరారు.

భారీగా నిషేధిత ఆస్తులు

జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాను రూపొందించారు. ఇందులో మొత్తం 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908లోని సెక్షన్‌ 22 ఏ పీవోటీ చట్టంలో చేర్చారు. మొత్తం 2,450 సర్వే నంబర్లలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వీటితో పాటు సీఐడీ, సిట్‌, ఏసీబీ కేసుల్లో ఉన్న 258 ఎకరాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు నిలిచిపోయి, ఆస్తుల విలువలు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

కలెక్టర్‌కు వినతి

నిషేధిత జాబితా నుంచి పేదల పేర్లు తొలగించాలని కోరుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఆలేరులోని సర్వే నంబర్లు 7, 46, 526, 589, 961, 1019, 1026, 1044, 1106, 1115తోపాటు, ఆలేరు మండలంలోని తొమ్మిది గ్రామాలలో తెచ్చిన రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908 లోని సెక్షన్‌ 22ఏ కింద భూములను నిషేధిత ఆస్తుల రిజిస్టర్‌లో చేర్చడాన్ని రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారని, ఆ ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి కనెక్షన్లు ఉన్నాయని, హౌస్‌ టాక్స్‌, నీటి బిల్లులు, విద్యుత్‌ బిల్లులు క్రమంగా చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ జాబితా నుంచి తొలగించాలని కోరింది.

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే సునిత, బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు

ఫ నిషేధిత జాబితా నుంచి

పేదల ఇళ్లు, స్థలాలు

తొలగించాల్సిందే

ఫ క్షేత్రస్థాయిలో పోరుబాటపట్టిన బీఆర్‌ఎస్‌, బీజేపీ

ఫ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన విప్‌ బీర్ల ఐలయ్య

ఫ కలెక్టర్‌కు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే సునీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement