మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Mar 19 2026 7:29 AM | Updated on Mar 19 2026 7:29 AM

హుజూర్‌నగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్‌లో మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు చింతా బాబు, ఎమ్మార్పీఎస్‌

సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం హుజూర్‌నగర్‌లో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రావూరి విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం చింతా బాబు మాట్లాడుతూ.. ఈ నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబ్బ రమేష్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేళ్లచెరువు ముక్కంటి, జిల్లా యువసేన అధ్యక్షులు బి. నాగరాజు, ఎం. వెంకటయ్య, పి. కాటమయ్య, కే. నాగేశ్వరరావు, రాము, సైదులు, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement