మారిషస్‌ పర్యటనలో పటేల్‌ రమేష్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

మారిషస్‌ పర్యటనలో పటేల్‌ రమేష్‌రెడ్డి

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రంలో పర్యాటకం, వ్యవసాయంలో ఆధునాతన సాంకేతిక వినియోగం కోసం మారిషస్‌ దేశంతో కలిసి పనిచేసేందుకు గాను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, అగ్రికల్చర్‌ కమిషన్‌ సభ్యురాలు భవానిరెడ్డితో కలిసి మంగళవారం మారిషస్‌ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మారిషన్‌ ప్రధాని ధరం గోకుల్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, పెట్టుబడుల అవకాశాలు, పరస్పర సహకారంతో చేపట్ట గల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో మారిషస్‌ తెలుగు మహాసభ అధ్యక్షులు హెవిన్‌ గురయ్య, సమన్వయ కర్త విశ్వకర్మ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement