ఇసుక అక్రమ నిల్వలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ నిల్వలపై దాడులు

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

అనంతగిరి : మండల పరిధిలోని పాలారం గ్రామంలో కొందరు వ్యక్తులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచరం అందడంతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించారు. సుమారు 43 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యదర్శికి అప్పగించినట్లు తహసీల్దార్‌ కె. హిమబిందు పేర్కొన్నారు. కాగా.. ఇసుక డంప్‌ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియలేదని ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ వెంకటనగేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

43 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌ చేసిన

రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement