చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ ఊర చెరువులో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవని సీఐ పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కారోబార్ పర్వతం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన 87126 62744, 87125 53699 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


