జూదరుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జూదరుల అరెస్ట్‌

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

మిర్యాలగూడ టౌన్‌ : మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి 8 మంది జూదరులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియా

చెల్లించాలి

నల్లగొండ టౌన్‌ : గీత కార్మికులకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని గీత పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25న ఎకై ్సజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం ఏర్పాటు చేయాలని, గీత వృత్తికి నష్టం కలిగిస్తున్న మద్యం బెల్టు షాపులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొడిగె సైదులు, సురిగి చలపతి, పుల్లయ్య, లాలు, పల్లె శంకర్‌, జోగు సురేందర్‌, మాదగోని మల్లయ్య, దేవేందర్‌, లెనిన్‌, గంగాదేవి, గ్యాలయ్య పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

వలస కూలీ మృతి

పెద్దవూర: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన పెద్దవూర మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్‌భాంజ్‌ జిల్లాకు చెందిన రామ్‌రే ఎంబర్రం(23) రెండు నెలలుగా పెద్దవూర మండల కేంద్రంలోని కార్తికేయ టెక్స్‌టైల్‌ కాటన్‌ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కాటన్‌ మిల్లు నుంచి తన స్నేహితులైన రూపానాయక్‌, మంజు పూర్తిలతో కలిసి కూరగాయలు కొనుగోలు చేయడానికి జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి వెంట పెద్దవూర మండల కేంద్రానికి నడుచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో కొండమలేపల్లి వైపు నుంచి పెద్దవూర వైపు అతివేగంగా వస్తున్న కారు రామ్‌రే ఎంబర్రంను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో రామ్‌రే ఎంబర్రం ఎగిరి రోడ్డు పక్కన పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువు డుంబీ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై. ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement