ఆత్మకూరు(ఎం) : భార్యను కత్తితో పొడిచిన భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన దేవికి, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన వెంపటి మహేష్‌తో 2012లో వివాహం జరిగింది. వీరు బీబీనగర్‌లో ఉంటూ తాపీ మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే దేవి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మహేష్ అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల దేవి తన పుట్టిల్లు ఆత్మకూరు(ఎం)కు వచ్చింది. దేవిని తీసుకెళ్లడానికి మహేష్ సోమవారం ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా.. మహేష్ కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దేవిని విచక్షణారహితంగా పొడిచాడు. దేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం మహేష్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ హనుమంతు తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
యువకుడి అదృశ్యం
మునుగోడు : కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన బొజ్జ వంశీ మంగళవారం కుటుంబ సభ్యులపై అలిగి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. వంశీ ఆచూకీ తెలిస్తే 99120 68559, 95050 02559 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి
లింగాలఘణపురం : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం –పాలకుర్తి రోడ్డులో చీటూరు సమీపంలో అప్పిరెడ్డిపల్లి గ్రామ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరికి చెందిన డ్రైవర్ మహ్మద్ జహీర్ (55) డీసీఎంలో మొక్కజొన్న లోడ్‌తో పాలకుర్తి నుంచి జనగామ వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో చీటూరు సమీపంలోని అప్పిరెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన మహ్మద్ జహీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు


