60 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

60 కిలోల గంజాయి పట్టివేత

Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM

రామన్నపేట : ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నలుగురిని చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేట, మోత్కూరు సీఐలు ఆర్‌. బాలాజీనాయక్‌, కె. రవిచంద్రారెడ్డి తమ సిబ్బందితో పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా 6.685 కిలోల ఎండు గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒడిశాలోని బరంపురం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు ఆటో, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన గంగాబాయ్‌ పాండురంగ చౌహాన్‌, కమల్‌ అర్జున్‌ మోహితే, విజయ్‌ అసరం గోరపడే, నల్లగొండకు చెందిన పల్లపుదాసు వేణుకుమార్‌ను అదుపులోకి తీసుకోని రామన్నపేట ఎకై ్సజ్‌ కార్యాలయాలని తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐలు ఎన్‌. శంకర్‌, బి. శివకృష్ణ, పి. సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు.

నలుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement