మిర్యాలగూడ : దామరచర్ల రైతు వేదికలో ఆత్మ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి. శ్రీధర్ సమగ్ర వ్యవసాయం, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటల సాగుతో పాటు పాడి, కోళ్లు, చేపలు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలను చేపట్టినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. అంతేకాకుండా రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని, కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుందని, ఒక దాని వ్యర్థం మరొకదానికి ఆహారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ రుషేంద్రమణి, హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా, ఆత్మ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, బీటీఎం గిరి, ఏటీఎం కృష్ణ, ఏఈఓలు పార్వతి, ప్రియాంక, రైతులు మల్లేష్, బాలు, నగేష్, ధనలక్ష్మి, సర్పంచ్ మంగ్తా, ఉప సర్పంచ్ గాలి ప్రియాంక పాల్గొన్నారు.


