నామినేషన్లు 1,617
సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో 28నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. మూడు రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాల ఆవరణలు సందడిగా, కోలాహలంగా మారాయి.
ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులు
జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో మొత్తం 141 వార్డులకు గాను 1,617 నామినేషన్లు వచ్చాయి. ఒక్కో వా ర్డుకు ఒక్కో పార్టీ నుంచి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు 24 నామినేషన్లు రాగా రెండో రోజు 455, చివరి రోజు 1,138 మంది నామినేషన్ వేశారు.
నేడు నామినేషన్ల పరిశీలన
నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు.నామినేషన్లకు జత చేసిన వవిధ ధ్రువపత్రాలను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురించనున్నారు.
ఖరారు కాని అభ్యర్థుల ఎంపిక
నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 3వ తేదీ వరకు బీఫాం ఇచ్చే అవకాశం ఉండటంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు టికెట్‌పై ఎవరికి వారే ఆశలు పెంచుకున్నారు. ప్రధాన పార్టీల తరఫున ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆఖరి రోజు భారీగా దాఖలు
ఫ అత్యధికంగా సూర్యాపేటలో 741 మంది నామినేషన్
ఫ పలు చోట్ల రాత్రి 7 గంటల వరకు కొనసాగిన ప్రక్రియ
ఫ మున్సిపాలిటీల్లో ముగిసిన తొలి ఘట్టం
నామినేషన్లు ఇలా..
మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు
సూర్యాపేట 48 741
నేరేడుచర్ల 15 90
కోదాడ 35 333
తిరుమలగిరి 15 160
హుజూర్‌నగర్ 28 293


