రాజేష్ మృతిపై మంత్రి మౌనం వీడాలి
అనంతగిరి, మేళ్లచెరువు: కర్ల రాజేష్ లాకప్‌డెత్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికై నా మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతగిరి, మేళ్ల చెరువులో నిర్వహించిన కర్ల రాజేష్ సంతాప సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజేష్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ 70 రోజులుగా పోరాటం చేస్తున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఎందుకు స్పందించడం లేదన్నారు. సామాన్య పౌరులకు శిక్షలు ఉన్నప్పుడు రాజేష్ మృతికి కారకులైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేకపోతే ఉత్తమ్‌దంపతులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 4న నిర్వహించే చలో సూర్యాపేట కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి మాదిగలు భారీగా తరలిరావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు బొడ్డు కుటుంబరావు, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజియాదవ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్లా భూపాల్‌రెడ్డి, సీసీపీ మండల కార్యదర్శి రవి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్‌నాయక్, మహిళా నాయకురాలు వెంపటి నాగమణి, బీఎస్పీ నాయకులు నూకల గోపాల్‌యాదవ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండపల్లి సూరి మాదిగ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు ఆకారపు కొండలు, సీపీఐ నాయకులు ఉస్తేల నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సృజన, బీజేపీ మండల అధ్యక్షుడు పత్తిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


