రోడ్డు భద్రత.. మనందరి బాధ్యత
మేళ్లచెరువు : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి రోడ్డు భద్రతా నిబంధనలపై చైతన్యం తీసుకువచ్చారు. శుక్రవారం మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ వాణి, ఉమ్మడి జిల్లా ఆర్‌టీఓలు జయప్రకాశ్‌రెడ్డి, లావణ్య, జిలానీ, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.


