180 మందికి విధులు
కోదాడ: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు మరింత వేగం పెంచారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆలోపే ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చారు.
మూడు వార్డులకు ఒక ఆర్వో
నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి(ఆర్‌ఓ)ని, అతనికి సాయంగా మరో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్‌ఓ)ని నియమించారు. ఇద్దరు లేదా ముగ్గురు ఆర్‌ఓలపై పర్వవేక్షణకు ఒక జోనల్ అధికారిని నియామకం చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కలిపి 180 మంది అధికారులను నియమించారు. వీరిలో ఆర్‌ఓలు 59, ఏఆర్‌ఓలు 59, జోనల్ అధికారులు 46, మరో 16 మంది అధికారులను రిజర్వులో ఉంచారు. వీరికి శనివారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వీరంతా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మున్సిపాలిటీలకు వెళ్లి తమకు కేటాయించిన వార్డుల్లో విధులు నిర్వహించాలి. వీరికోసం ప్రత్యేక చాంబర్‌లు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన ఆర్వో వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీలకు చేరిన ఎన్నికల సామగ్రి
ఎన్నికల నిర్వహణకు అవసరమైన నామినేషన్ పత్రాలతో పాటు అన్ని రకాల పత్రాలు శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో మున్సిపాలిటీలకు చేరాయి. పత్రాలను అధికారులు వార్డుల వారీగా వేరు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకం
ఆర్వోలు, ఏఆర్వోలు,
జోనల్ ఆఫీసర్లకు ముగిసిన శిక్షణ
మున్సిపాలిటీలకు చేరిన సామగ్రి
372 పోలింగ్ కేంద్రాలు
ఐదు మున్సిపాలిటీల్లో 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు ముగ్గురు చొప్పున 1,116 మంది సిబ్బందిని నియమించనున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నందున బ్యాలెట్ బాక్స్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. 817 బ్యాలెట్ బ్యాక్సుల అవసరమవుతాయని, అదనంగా మరో 372 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
నియమించిన అధికారులు ఇలా..
మున్సిపాలిటీ ఆర్వోలు ఏఆర్వోలు జోనల్ రిజర్వు
కోదాడ 16 16 09 04
సూర్యాపేట 16 17 17 05
హుజూర్‌నగర్ 12 12 07 03
నేరేడుచర్ల 07 08 07 01
తిరుమలగిరి 08 08 06 03
మొత్తం 59 59 46 16


