నామినేషన్ల ఎంట్రీలో తప్పులు దొర్లొద్దు
మేళ్లచెరువు : నామినేషన్‌ల వివరాలను తప్పులు దొర్లకుండా టీపోల్ యాప్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ సూచించారు. శుక్రవారం ఆయన మేళ్లచెరువు, చింతలపాలెం మండల కేంద్రాల పాటు రామాపురం, దొండపాడు గ్రామాలలోని క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులు వేసే నామినేషన్ పత్రాల విషంయలో ఏమైనా సందేహలుంటే హెల్ప్ డెస్క్‌ల సిబ్బంది తీర్చాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌లు రాజేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు అస్గర్‌అలీ, రామచంద్రరావు, మండల పంచాయతీ అధికారి, భూపాల్‌రెడ్డి, ఎస్‌ఐ పరమేష్, ఆర్‌ఓలు ఉన్నారు.


