కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి
సూర్యాపేట అర్బన్ : పోలీసుల దాడి కారణంగా మరణించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అతడి మృతికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జి కుంట్ల ధర్మార్జున్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, మాస్‌లైన్ నేత నరసన్న డిమాండ్ చేశారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఎల్గూరి గోవింద్ గౌడ్, సట్టు నాగన్న, బొల్లెద్దు వినయ్ మాల, అంబేద్కరిస్టు కాశిమల్ల వెంకట నరసయ్య, దైద శీను, మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


