హోంగార్డుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి కృషిచేస్తామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ నెల 6న హోంగార్డుల వ్యవస్థ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన రక్తదాన శిబిరం, హోంగార్డు ఆఫీసర్స్‌కు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ పోలీస్ సిబ్బందితో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో పనిచేస్తున్నారని అభినందించారు. రక్తదాన శిబిరం అనంతరం కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్స్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, హోంగార్డ్ ఇన్‌చార్జి ఆర్‌ఎస్‌ఐ అశోక్, సాయిరాం, సురేస్, సిబ్బంది పాల్గొన్నారు.
మీ సేవలపై కమిషనర్ ఆరా
కోదాడ: పట్టణంలోని మీ సేవ కేంద్రాలను శుక్రవారం రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ రవికుమార్ తనిఖీ చేశారు. పలు కేంద్రాల్లో సేవల నిర్వహణ, రుసుముల వసూలు, టోకెన్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. మీసేవ కేంద్రానికి వచ్చిన ప్రజలను సేవలపై ఆరా తీశారు. నాగార్జున మీ సేవ కేంద్రం అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాహకుడిని అభినందించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, ఈడయం గపూర్‌అహ్మద్, జిల్లా మేనేజర్ సైదానాయక్ మీసేవ నిర్వాహకుడు కె.ప్రవీణ్ ఉన్నారు.
దండు మైసమ్మ
ఆలయ హుండీ లెక్కింపు
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయ హుండీని శుక్రవారం లెక్కించారు. 120 రోజులకు గాను భక్తులు కానుకలు సమర్పించుకోగా రూ.7,32,310 వచ్చినట్లు ఆలయ అధికారి జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, సర్వయ్య, జిల్లా దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సిబ్బంది, అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
‘వీఎన్’ జీవితం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట అర్బన్ : జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మల్లు వెంకటనరసింహారెడ్డి (వీఎన్) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లు వెంకటనరసింహారెడ్డి 21వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం వీఎన్ పోరాటం మరుమలేనదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు కోట గోపి, వేల్పుల వెంకన్న,ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మేకనబోయిన శేఖర్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, వల్లపు దాసు సాయికుమార్, పిండిగా నాగమణి, మేరెడ్డి కృష్ణారెడ్డి, సైదమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
హోంగార్డుల సంక్షేమానికి కృషి
హోంగార్డుల సంక్షేమానికి కృషి


