గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
నడిగూడెం, తుంగతుర్తి: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి ఆకాంక్షించారు. మూడు రోజులుగా నడిగూడెం, తుంగతుర్తి మండల కేంద్రాల్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి 11వ జోనల్ స్పోర్ట్స్‌మీట్ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందిచుకోవాలన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా నడిగూడెం
జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల నిలిచింది. అండర్–14, అండర్–17 కబ్బడ్డీ, అండర్–19 వాలీబాల్‌లో ప్రథమ బహుమతి, అండర్–14 ఖోఖోలో ద్వితీయ, అండర్–19 టెన్నికాయిట్‌తో పాటు చెస్, క్యారమ్స్ అండర్–14, 17 విభాగాల్లో సైతం నడిగూడెం గురుకులం ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ పద్మ, కోదాడ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వేపూరి తిరపమ్మ, ఎస్‌ఐ గందమళ్ల అజయ్ కుమార్ పాల్గొన్నారు.
తుంగతుర్తిలో..
మూడు రోజుల పాటు కొనసాగిన 11వ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలకు చెందిన 765 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి చాంపియన్స్‌గా పాలకుర్తి, అడ్డగూడూరు గురుకుల పాఠశాలలు నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల డీసీఓ శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, స్పోర్ట్స్ ఇన్‌చార్జి జ్యోతిర్మయి, డాక్టర్ విజయ్‌కుమార్, హెచ్‌ఈఓ రవికుమార్, తల్లిదండ్రుల కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, పీడీలు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి


