ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
సూర్యాపేట : పెండింగ్‌లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయక పోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగంటి రంగా, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, నాయకులు పరాల సాయి, రాజబోయిన సుమన్, శివ, సాయికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ బీసీ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ


