పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్‌కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.
పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం


