పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సూర్యాపేట: : ఇటీవల వచ్చిన మోంథా తుపాన్ ప్రభావంతో కురిసి భారీ వర్షాలకు నష్టపోయిన పంటను అంచనావేసి రైతాంగానికి పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తుపాన్ వల్ల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పత్తి రంగు మారడంతో పాటు చెట్లపైనే కాయలుకుళ్లిపోయాని అన్నారు. దీంతో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ఽకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్ రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, రైతు సంఘం నాయకులు దేవరం వెంకటరెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి,నారాయణ వీరారెడ్డి, అప్పయ్య పాల్గొన్నారు.


