మూడు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 4,927 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు 3 గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 4,861 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.70 అడుగుల (4.12 టీఎంసీల) నిల్వ ఉంచి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు, సీపేసీ, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 70 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని తెలిపారు.


