పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి
సూర్యాపేట: ప్రజావాణికి సంబంధించి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావుతో కలిసి ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. అధికారుల కృషిఫలితంగానే హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా విజయవంతమైందన్నారు. అనంతరం డీఆర్‌డీఓ వి.వి అప్పారావు, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాంనాయక్, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌కు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నరసింహారావు, శంకర్, శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డి. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.


