వార్డు కమిటీలు నిస్తేజం
సూర్యాపేట అర్బన్: మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన వార్డు కమిటీలు నిస్తేజంగా మారాయి. పట్టణాల అభివృద్ధిలో ఈ కమిటీల భాగస్వామ్యం ఎక్కడా కన్పించడంలేదు. ఫలితంగా స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయి.
141వార్డుల్లో..
పట్టణాల అభివృద్ధిలో పాలకవర్గం, అధికారయంత్రాంగంతో పాటు ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో 2020 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం వార్డుకమిటీలు ఏర్పాటు చేసింది. వార్డుకు నాలుగు కమిటీల చొప్పున ఒక్కో కమిటీల్లో 15 మంది సభ్యులను ఎంపిక చేశారు. యువజన సంఘం, సీనియర్ సిటిజన్ ,మహిళా సంఘం, వార్డు ప్రముఖులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో 2,115 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరంతా వార్డు అవసరాలపై అవగాహన కలిగి ఉంటారని భావించారు. ప్రజలు, అధికారుల మధ్య కమిటీ సభ్యులు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఏర్పాటు చేసిన రోజు మినహా సభ్యులను ఇంతవరకు మున్సిపల్ కార్యాలయాలకు పిలిచిన దాఖలాలు లేవు. వారి సలహాలు స్వీకరించింది లేదు. దీంతో వార్డుల్లో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వివిధ పట్టణాల్లో రాజకీయ కారణాలతో కమిటీలు నామ మాత్రం అయ్యాయి. మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో మొక్కుబడిగా మారాయి.
ప్రధాన సమస్యలు..
ఫ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు
ఫ నాలాల ఆక్రమణలు పెరిగాయి. మిషన్ భగీరథ నీరు కొన్ని పట్టణాల్లో సరిగా రావడం లేదు. ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం కొరబడింది
ఫ నాలాల ఆక్రమణతో వర్షం పడినప్పుడు ఇళ్లలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి
ఫ వార్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్నాయి
ఫ అధికారులు, పాలకవర్గాల తీరుతో కాగితాలకే పరిమితం
ఫ మున్సిపాలిటీల్లో
పేరుకుపోతున్న సమస్యలు
ఫ అధికారుల చుట్టూ
ప్రదక్షిణ చేస్తున్న ప్రజలు


