గోదావరి జలాలు పునరుద్ధరణ
అర్వపల్లి: జిల్లాకు గోదావరి జలాలను సోమవారం పునరుద్ధరించారు. అయితే వానాకాలం సీజన్‌కు గాను సెప్టెంబర్ 8నుంచి నీటిని జిల్లాకు విడుదల చేశారు. వారబంధీ విధానం అయినప్పటికీ నిరంతరాయంగా 50 రోజుల పాటు అక్టోబర్27 వరకు నీటిని వదిలారు. ఆతర్వాత నీటిని నిలిపివేశారు. అయితే భారీ వర్షాలకు ఎస్సారెస్పీ నిండి గేట్లు ఎత్తడంతో జిల్లాకు మళ్లీ గోదావరి జలాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు.
విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
సూర్యాపేట అర్బన్: విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉంటారన్నారు . రైతులు, గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయమని స్పష్టం చేశారు. మీటర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే తెచ్చి బిగిస్తామని తెలిపారు. సిటిజన్‌చార్ట్‌లో పేర్కొన్న విధంగా పనులు చేయకపోతే విద్యుత్ అధికారులపై వినియోగదారులు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. సదస్సులో డీఈ శ్రీనివాస్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలను 26 వేల రూపాయలకు పెంచి వారందరిని పర్మినెంట్ చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య కోరారు. తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ – మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఈమేరకు డీపీఓ యాదగిరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ – మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి సామా నర్సిరెడ్డి, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు ,జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, సూరారపు లక్ష్మణ్ పాల్గొన్నారు.
గోదావరి జలాలు పునరుద్ధరణ
గోదావరి జలాలు పునరుద్ధరణ


