విద్యలో అగ్రస్థానంలో నిలపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యలో అగ్రస్థానంలో నిలపాలి

Nov 4 2025 7:50 AM | Updated on Nov 4 2025 7:50 AM

విద్యలో అగ్రస్థానంలో నిలపాలి

విద్యలో అగ్రస్థానంలో నిలపాలి

సూర్యాపేట : ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా ను ఉపయోగించి విద్యార్థులను కార్పొరేట్‌కు దీటుగా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దెలా ఉపాధ్యాయులు కృషి చేసి జిల్లాను విద్య లో అగ్ర స్థానంలో నిలపాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పాఠశాలలో రోజూ ఫుడ్‌ టెస్టింగ్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు కచ్చితంగా రిజిస్టర్‌ను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిలో నాణ్యత పాటిస్తూ మెరుగైన పోషకాహారం అందించాలన్నారు. ఎక్కడైనా మధ్యాహ్నం భోజనం విషయంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, కోఆర్డినేటర్లు జనార్దన్‌, శ్రావణ్‌, రాంబాబు, పూలన్‌, డీఈ రమేష్‌, ఏఈ ఓబులేసు, ఎంఈఓ లు, కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు పాల్గొన్నారు.

ఉచిత చేపపిల్లల పంపిణీకి సంసిద్ధం

జిల్లాలో చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీకి రూట్‌మ్యాప్‌తో సహా సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇదే అంశంపై జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా చేప పిల్లల స్టాకింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి. నాగులు, డీపీఓ యాదగిరి, జిల్లా ఇరిగేషన్‌ అధికారి యాదగిరి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement