అడ్డగోలుగా.. అడ్డుగోడలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా.. అడ్డుగోడలు

Oct 18 2025 7:39 AM | Updated on Oct 18 2025 7:39 AM

అడ్డగ

అడ్డగోలుగా.. అడ్డుగోడలు

గోడ పెట్టినా.. రోడ్డు ఇవ్వాల్సిందే..

పక్క వెంచర్ల వారికి దారి

లేకుండా పోతోంది

కోదాడ: జిల్లా వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు.గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో ఎకరం.. రెండెకరాల విస్తీర్ణంలో వెంచర్లు ఏర్పాటు చేసి వాటిచుట్టూ అడ్డగోలుగా గోడలు నిర్మిస్తూ ఇరుపక్కలా, కింది వెంచర్లకు దారి ఇవ్వకుండా సతాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దారి ఇవ్వాలంటే తమకు ఒకప్లాట్‌ ఖరీదు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కేవలం 3 గేటెడ్‌ కమ్యూనిటీలకే అనుమతి ఉంది. కానీ, అనధికారికంగా 250 వెంచర్ల నిర్వాహకులు తమవి గేటెడ్‌ కమ్యూనిటీలని చెప్పుకుంటూ తమ వెంచర్ల చుట్టూ గోడలు పెట్టేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకరు తూర్పు–పడమర..

మరొకరు ఉత్తరం–దక్షిణం

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టం వచ్చినరీతిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రోడ్డు వైపు వెంచర్‌ ఏర్పాటు చేసిన వారు రోడ్లను తూర్పు–పడమర దిశలో ఏర్పాటు చేస్తుండగా, దాని పక్కనే వెంచర్‌ చేస్తున్నవారు రోడ్లను ఉత్తరం–దక్షిణం దిశలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో అస్తవ్యస్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో వాటర్‌, డ్రెయినేజీల ఏర్పాటు చేయడం కష్టంగా మారుతుందని, భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు కిందకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. రోడ్డు వైపు ఏర్పాటు చేసిన వెంచర్‌కు అనుగుణంగా దాని కింది వైపువారు రోడ్లను ఏర్పాటు చేయాలన్నా ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు.

మున్సిపాలిటీ పేర రోడ్ల రిజిస్ట్రేషన్‌

నామమాత్రమే!

మున్సిపాలిటీల పరిధిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ వెంచర్లకు అనుమతులు తీసుకున్న తరువాత వాటిలో నిబంధనల ప్రకారం రోడ్లను ఏర్పాటు చేసి వాటిని మున్సిపాలిటీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయాలి. సామాజిక అవసరాల కోసం వెంచర్‌ విస్తీర్ణంలో 10 శాతం భూమిని కేటాయించి దాన్ని కూడా మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయాలని నిబంధనలు ఉన్నా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమల గిరిలో కేవలం నాలుగు వెంచర్లలోనే రోడ్లను మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్‌ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గేటెడ్‌ కమ్యూనిటీల పేరుతో రియల్టర్ల నయాదందా

ఫ పక్కవారికి దారిలేకుండా

వెంచర్ల చుట్టూ గోడల నిర్మాణం

ఫ దారి ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్‌

ఫ మున్సిపాలిటీ పేర

రిజిస్ట్రేషన్‌ చేయని రోడ్లు

ఫ నిబంధనలకు విరుద్ధంగా

వ్యవహరిస్తున్న వ్యాపారులు

కోదాడ మున్సిపాలిటీలో ఒక్క గేటెడ్‌ కమ్యూనిటీ కూడా లేదు. వెంచర్ల చుట్టూ గోడలు పెట్టినప్పటికి పక్క వెంచర్‌ వారికి రోడ్డు కోసం ఓపెన్‌ చేయాల్సిందే. ఒక ప్రాంతంలో వెంచర్ల నిర్వాహకులు ఒకేవిధంగా రోడ్లను ఏర్పాటు చేయాల్సిందే. దారి ఇవ్వడం లేదని ఇప్పటి వరకు ఫిర్యాదులు రాలేదు. వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– ప్రసాద్‌, టీపీఓ కోదాడ

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొత్త దందాకు తెరతీస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో వెంచర్ల ఏర్పాటు చేస్తూ వాటి చుట్టూ గోడలు నిర్మిస్తున్నారు. దీంతో పక్క వెంచర్ల వారికి దారిలేకుండా పోతోంది. దారి ఇవ్వాలంటే ఒక ప్లాట్‌ ఖరీదు చెల్లించాలని నిబంధనలు పెడుతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి.

– అప్పిరెడ్డి, కోదాడ

అడ్డగోలుగా.. అడ్డుగోడలు1
1/2

అడ్డగోలుగా.. అడ్డుగోడలు

అడ్డగోలుగా.. అడ్డుగోడలు2
2/2

అడ్డగోలుగా.. అడ్డుగోడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement