
ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని పులిపలపులు, కల్వలపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, ఎంపీడీఓ యుగేందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సింగం వెంకన్న, ఎన్.శేఖర్‌రెడ్డి, సీఈఓ సుఖేందర్, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఏఈఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి