డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా డెవలప్‌ చేస్తావ్‌, నీ దగ్గర ఉన్న ప్లాన్స్‌ ఏంటి? | - | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా డెవలప్‌ చేస్తావ్‌, నీ దగ్గర ఉన్న ప్లాన్స్‌ ఏంటి?

Oct 18 2025 7:37 AM | Updated on Oct 18 2025 7:39 AM

అధ్యక్ష పదవి రాకపోతే రాహుల్‌ టీంలోకి.. ఒక్కో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరుగురి పేర్లతో రూపొందించే జాబితాలపై టీపీసీసీ అధ్యక్షుడు, సీఎంతో చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత అందులో ముగ్గురి పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసి, రూపొందించే జాబితాను ఈనెల 19వ తేదీన ఏఐసీసీకి పంపించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నెలాఖరుకు డీసీసీ అధ్యక్షులను నియమించేలా కాంగ్రెస్‌ పార్టీ చర్యలు చేపడుతోంది. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో జిల్లాకు ఒకరికే అధ్యక్ష పదవి దక్కనుంది. మిగతా వారిలో బాగా పని చేసే యువతను కూడా మరో జాబితాగా షార్ట్‌ లిస్ట్‌ చేయనున్నట్లు తెలిసింది. వారిని రాహుల్‌గాంధీ టీంలో పని చేసేందుకు ప్రత్యేకంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఆశావహుల జాబితా పెద్దదే..

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష

ఆశావహులతో పరిశీలకుల భేటీ

వివిధ అంశాలపై వారిని

ప్రశ్నించిన అబ్జర్వర్లు

నియోజకవర్గాల్లో ముగిసిన

అభిప్రాయ సేకరణ సమావేశాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుల (డీసీసీ) నియామకం కోసం నియోజకవర్గాల్లో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు చేపట్టిన అభిప్రాయ సేకరణ శుక్రవారంతో ముగిసింది. ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్‌ మహంతి, పీసీసీ పరిశీలకుడు సంపత్‌కుమార్‌ తదితరులు శుక్రవారం నల్లగొండలో డీసీసీ అధ్యక్ష పదవి ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా మాట్లాడారు. ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం ఏం చేశావు.. డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తావ్‌.. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతావు. అందుకు నీ దగ్గర ఉన్న ప్లాన్స్‌ ఏంటి’..? అనే తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు. ఆశావహుల ఆలోచనా విధానం, వ్యూహాలను కూడా పరిశీలించారు. పార్టీ కోసం వారు ఏం చేయగలుతారన్న అంశాలపై ఓ అంచనాకు వచ్చేలా ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను సేకరించారు. నల్లగొండతో పాటు సూర్యాపేట జిల్లాలోనూ దరఖాస్తుల స్వీకరణతో పాటు డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు.

డీసీసీ అధ్యక్షుల ఎంపిక

పారదర్శకంగా ఉండేలా..

కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా నియోజక వర్గాల వారీగా పరిశీలకులను పంపించి ఉమ్మడి జిల్లాలో సమావేశాలను నిర్వహించింది. అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండటంతోపాటు పార్టీ కోసం పని చేసిన విధేయులకే డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనే లక్ష్యంతో అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించారు. పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది.. పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయగలిగే సత్తా ఎవరికి ఉంది.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరిగేలా కృషి చేసే సత్తా ఎవరికి ఉందన్న ఈ అభిప్రాయ సేకరణను చేపట్టి పూర్తి చేసింది.

సత్తా ఎవరికి ఉంది..

డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ, అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని క్రోడికరించి ఆరుగురితో కూడిన జాబితాను రూపొందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, జనరల్‌ కేటగిరీల్లో ఆశావహులు ఎవరెవరు ఉన్నారు.. అందులో పార్టీకి విధేయులుగా ఉంటూ కష్ట్టకాలంలో పార్టీ కోసమే పని చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు ఎవరెవరు ఉన్నారు.. పార్టీని జిల్లాలో బాగా ముందుకు తీసుకెళ్లగలితే సత్తా ఎవరికి ఉంది? ముఖ్య నేతలు ఎవరికి ఎక్కువ మంది సపోర్టు చేశారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరికి సపోర్టు చేస్తున్నారనే తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ జాబితాను రూపొందించనున్నారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.

నల్లగొండ జిల్లాలో గుమ్మల మోహన్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కై లాష్‌నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌, దైద రవీందర్‌, రాజారమేష్‌యాదవ్‌, ఖాన్‌, చామల శ్రీనివాస్‌, సుంకరబోయిన నర్సింహయాదవ్‌, పోకల దాస్‌, బోళ్ల వెంకట్‌రెడ్డి, దూదిపాళ్ల వేణుధర్‌రెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్‌, గుంజ రేణుక, తిప్పర్తి రుక్మారెడ్డి, సలీమ్‌, రామలింగం తదితరులు మొత్తం 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్న, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అనురాధ, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, తండు శ్రీనివాస్‌యాదవ్‌, అన్నపర్తి జ్ఞానసుందర్‌, ధరావత్‌ వెంకన్ననాయక్‌, యరగాని నాగన్న, వీరమల్లు యాదవ్‌, అల్లం ప్రభాకర్‌రెడ్డి తదితరులు మొత్తం 16 మంది దరఖాస్తు చేసుకున్నారు.

డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా డెవలప్‌ చేస్తావ్‌, నీ 1
1/1

డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ఎలా డెవలప్‌ చేస్తావ్‌, నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement