
సకాలంలో రుణాలు అందించాలి
భానుపురి (సూర్యాపేట) : కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కనీస మద్దతు ధరలు, పత్తి నాణ్యతా ప్రమాణాలు, కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పత్తిని విక్రయించేందుకు ఇకపై కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, రైతులే నేరుగా ఈ బుకింగ్ చేసుకునేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెటింగ్ కమిటీ సహాయ కార్యదర్శి ఎం.వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
భానుపురి (సూర్యాపేట) : 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైతులు, ప్రజలకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి డీసీసీ బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలు వార్షిక బడ్జెట్ రూ.6914.63 కోట్లు లక్ష్యంకాగా మొదటి మూడు నెలలలో రూ.2236.12 కోట్లు అందించి 32.34 శాతం వృద్ధి సాధించారని వివరించారు. ఇతర ప్రాధాన్యతారంగాల్లో వార్షిక బడ్జెట్ రూ.2196.61 కోట్లు లక్ష్యంకాగా మొదటి మూడు నెలల్లో రూ.971.95 కోట్లు అందించి 44.25 శాతం వృద్ధి సాధించారన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నాగప్రసాద్, ఆర్‌బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డ్ జిల్లా మేనేజర్ రవీంద్ర నాయక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నరసింహారావు పాల్గొన్నారు.
నిరంతరం పర్యవేక్షించాలి
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి మంత్రి అడ్లూరు లక్ష్మ ణ్ కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ సంక్షేమ, విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని అనంతరం జిల్లా సంక్షేమ శాఖల అధికారులతో మాట్లాడారు. కాన్ఫరెన్స్‌లో ఎస్టీ సంక్షేమ అధికారి శంకర్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్