
42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం
సూర్యాపేటటౌన్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతమని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని విద్యాసంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అధికారిక లెక్కల ప్రకారం 56 శాతా నికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించకుండా తాత్కాలిక జీఓల ద్వారా కాలయాపన చేయడం దారుణమన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు మడిపల్లి సాయితేజ, అంజి, సుమన్, ఏర్పుల రవి, సాయి, లోకేశ్, రఘు, ఉమేశ్, వేణు, పవణ్‌సాయి పాల్గొన్నారు.