
విద్యార్థులకు కామెర్లపై డీఎంహెచ్‌ఓ ఆరా
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఆరెంజ్ పాఠశాల విద్యార్థలు కామెర్ల వ్యాధి బారిన పడుతున్న విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ ఆరా తీశారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి నీటి నమూనాలు సేకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా పాఠశాలలో చదువుతున్న 25 మంది విద్యార్థులు జ్వరంతో పాటు కామెర్లతో బాధపడుతుండడంతో వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. కామెర్ల వ్యాధి లక్షణాలు కనిపించిన విద్యార్థులు 15 నుంచి 28 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోహరి, డాక్టర్ శ్రీశైలం, సతీశ్, మాస్‌మీడియా అధికారి సంజీవరెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ సీతామహలక్ష్మి పాల్గొన్నారు.
మేళ్లచెరువులో ప్రైవేటు పాఠశాలను
తనిఖీ చేసిన అధికారి
తాగునీటి నమూనాల సేకరణ