
ఎడమ కాల్వ గండ్లకు మరమ్మతులు చేయిస్తాం
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని యాతవాకిల్ల వద్ద గల వేములూరు ప్రాజెక్టు ఎడమ కాల్వకు పడిన గండ్లకు యుద్ధ ప్రాతి పదికన మరమ్మతులు చేయిస్తామని నీటి పారుదల శాఖ ఈఈ అశోక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలోని వరదాపురం, మంచ్యాతండా గ్రామాల వద్ద ఎడమ కాల్వకు గండ్లు పడటంతో సాగునీరంతా వృథాగా వెళ్లిపోతుండటంతో ఆయాగ్రామాల రైతులు, నాయకులు చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఈఈతో పాటు అధికారులు ఆ గండ్లను పరిశీలించి కొలతలు తీయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పంటలకు సక్రమంగా సాగునీరందేలా చూస్తామన్నారు. ఈకార్యక్రమంలో డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్, నాయకులు, రైతులు మాళోతు బాబునాయక్, నాగేశ్వరరావు, కిషన్‌నాయక్ , కోట్యా నాయక్, లష్కర్ కోటాలు తదితరులు ఉన్నారు.