
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండుగలకు స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమైనా బ్లూ లింక్స్ వచ్చినా, మెసేజ్ లు వచ్చినా వాటిని అనుసరించవద్దు. అపరిచితులు డబ్బులు అడిగితే స్పందించవద్దు. వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్, ఇతర బ్లూ లింక్స్ అనవసరంగా క్లిక్ చేయొద్దు. మీరు సైబర్ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలి. అలాగే సైబర్ క్రైం వెబ్ సైట్‌కు ఫిర్యాదు చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
– కె.నరసింహ, ఎస్పీ