
పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి
నేరేడుచర్ల : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(పీఆర్‌టీయూ టీఎస్) సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నేరేడుచర్లకు చెందిన ఉపాధ్యాయుడు కొణతం వెంకట్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూ(టీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌ల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తంగేళ్ల జితేందర్‌రెడ్డి, తీగల నరేష్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగల ఎల్లయ్య, మేకల రాజశేఖర్, గోదేశి దయాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యూసుఫ్, పాలకవీడు మండల అధ్యక్ష,. కార్యదర్శులు కొండా బాలకృష్ణ, గంధం ధర్మరాజు, మండల అసోసియేట్ అధ్యక్షులు అంజయ్య, మొహమ్మద్ జహీర్‌ఖాన్, ప్రగడ శేఖర్, నాగశంకర్, రాజేష్, శ్రీనివాస్, కొండయ్య, నాగరాజు, రమేష్, నారాయణరెడ్డి, కిరణ్‌కుమార్, తిరుపతయ్య, సూర్యం, బ్రహ్మానందం తదితరులు కొణతం వెంకట్‌రెడ్డిని అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
పెన్‌పహాడ్ : వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని, సకాలంలో హాజరుకావాలని డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధుల గుర్తింపును వేగవంతం చేయాలని కోరారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, మాతాశిశు సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద ఎంఎల్‌హెచ్‌పీలు రోజుకు 30 నుంచి 35మంది వరకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సిన్‌తో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈసమావేశంలో మండల వైద్యాధికారి రాజేష్, హెచ్‌ఈఓ వెంకన్న, సూపర్‌వైజర్‌లు వెంకయ్య, పూలమ్మ, అన్ని గ్రామాల హెల్త్ అసిస్టెంట్‌లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మూసీ నాలుగు గేట్లు ఎత్తివేత
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. మంగళవారం ఈ ప్రాజెక్టులోకి 5,854 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 532 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజ్, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 49 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రం వరకు 644.05 అడుగులు (4.21 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అధ్యాపకులకు శిక్షణ
నల్లగొండ టూటౌన్ : ప్రతివిద్యార్థి సబ్జెక్టులో మెరుగైన అభ్యసనాన్ని, సాంకేతికంగా మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చని ఎంజీయూ గణితశాస్త్ర విభాగం అధ్యాపకురాలు హైమావతి వివరించారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ అధ్యాపకులకు అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్‌పై శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రోగ్రాం, కోర్స్ లక్ష్యాల ఆధారంగా మూల్యాంకన విధానాన్ని అధ్యాపకులకు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువల రవి, మిర్యాల రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి