
నేరాల నిరోధానికి పటిష్ట ప్రణాళిక
హుజూర్‌నగర్ : నేరాల నిరోధానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు సీఐ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు వేగంగా పోలీసు సేవలు అందిస్తే ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కోర్టు విధులను పటిష్టంగా నిర్వహిస్తూ కేసుల్లో ఎక్కువ శిక్షలు పడేలా పోలీస్ సిబ్బంది కృషి చేయాలని అన్నారు. సైబర్ మోసాలు జరగకుండా ప్రజలను చైతన్యంచేయాలని, రోడ్డు ప్రమాదాల వల్ల ఎవరూ మరణించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. హుజూర్‌నగర్‌ను సేఫ్ టౌన్ ప్రాజెక్టుగా తీసుకున్నామని తెలిపారు. అందులో భాగంగా సర్కిల్ పరిధిలో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సర్కిల్ పరిధిలోగల హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి 50 కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళిక చేశామన్నారు. దీని ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, నేరాలు నిరోధించడం సులువు అవుతుందన్నారు. స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. సిబ్బంది కవాతు, యూనిఫామ్, పోలీస్ పరికరాలను, పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హరి బాబు, సీఐ చరమందరాజు, ఎస్‌ఐలు మోహన్ బాబు, రవీందర్, నరేష్, బాబు, కోటేష్, ఆర్‌ఎస్‌ఐ అశోక్, డీసీఆర్‌బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్, సీసీ సందీప్ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ