
హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రెడ్డి జాగృతి నాయకుడు మాధవరెడ్డి వేసిన పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు మంగళవారం సూర్యాపేట పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం కల్పించే 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటే బీసీలమంతా ఏకమై తరిమికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు భూపతి నారాయణ గౌడ్, దాసరి వెంకన్న యాదవ్, నాయకులు శ్రీకాంత్, సంపత్ నాయుడు, సుదర్శన్, శ్రీనివాస్, విజయ్ కృష్ణ, దశరథ, రమేష్, వాసుదేవ్, నాగేందర్, రామచంద్ర యాదవ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నరేష్, జానకి రాముడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.