
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేక చేసి, తులసీదళాలతో అర్చించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత జోడుసేవోత్సవం తదితర పూజలు చేపట్టారు.