
సమతుల ఆహారంతో ఆరోగ్యం
భానుపురి (సూర్యాపేట) : సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పేర్కొన్నారు. పోషణ మాసం 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీపై సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్–1 అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మనం తీసుకునే ఆహారంలో నూనె, చెక్కర, ఉప్పు సరిపోను మోతాదులో ఉండాలన్నారు. రోజువారి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా మునగ ఆకు తీసుకోవడంతో రక్తహీనత బారిన పడకుండా ఉంటామన్నారు. కిశోర బాలికలకు రోజూ పల్లీ పట్టీ, నువ్వుల లడ్డూ ఇవ్వాలని చెప్పారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని గురువారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్య హోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు.స్వామి అమ్మవారిని నూతన వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం స్వామవారి కల్యాణ తంతు జరిపించి గరుడ వహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లి రావు, విజయ్ కుమార్, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు అందుబాటులో ఉంచాం
నడిగూడెం : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా సహకార శాఖ పర్యవేక్షణ అధికారి డి. చంద్రకళ తెలిపారు. నడిగూడెం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రిజిస్టర్లతో పాటు యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట ఎస్‌ఐ గందమళ్ల అజయ్ కుమార్, సహకార సంఘం చైర్మన్ కొల్లు రామారావు, ఇన్‌చార్జి మండల వ్యవసాయాధికారి ఎన్.పిచ్చయ్య, సీఈఓ కిరణ్ కుమార్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మహిళలు పోరాడాలి
సూర్యాపేట అర్బన్: మత చాందస వాదానికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలను చైతన్యంవంతులను చేయడానికి ప్రగతిశీల మహిళా సంఘం అనేక సదస్సులు, చర్చలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తోందన్నారు.రాజేశ్వరి, మాధవి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ, రాష్ట్ర కార్యదర్శి ఆర్. సీత, ఎఫ్‌టీయూ సహాయ కార్యదర్శి గంట నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి నరసమ్మ, వాణిశ్రీ, రామలింగమ్మ, మంగమ్మ, సైదమ్మ పాల్గొన్నారు.

సమతుల ఆహారంతో ఆరోగ్యం

సమతుల ఆహారంతో ఆరోగ్యం

సమతుల ఆహారంతో ఆరోగ్యం