
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
సూర్యాపేటటౌన్ : ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని జీజీహెచ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం ఆస్పత్రి ఎదుట చేపట్టిన ధర్నా మూడో రోజు కూడా కొనసాగింది.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ పద్ధతిని అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రతి నెలా ఐదో తేదీ లోపు జీతం వచ్చేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అశోక్‌కుమార్, రమాకాంత్, జానకిరాములు, సంతోష్, వెంకన్న, మహేష్, ఉపేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు సంఘాభావం తెలిపారు.