
డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేయాలి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ మండలంలోని సీతారాంపురం నుంచి హుజూర్‌నగర్‌లోని ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డీటీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. డబుల్ ఇళ్లు పూర్తి చేసి రెండు నెలల్లో అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నాగారపు పాండు, పల్లె వెంకటరెడ్డి, యాకూబ్, వి.సైదులు, డి.బ్రహ్మం, పి.హుస్సేన్, శ్రీను, వెంకటచంద్ర, భిక్షం, వెంకటయ్య, వీరస్వామి, సైదమ్మ, సరిత ఎల్లమ్మ వీరస్వామి, నరేష్, ఏసు, సైదులు, చంబయ్య కోటమ్మ పాల్గొన్నారు.