ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అరెస్ట్‌

Jul 28 2025 12:20 PM | Updated on Jul 28 2025 12:20 PM

ఇద్దర

ఇద్దరు అరెస్ట్‌

వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను భువనగిరి పట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

పూర్తిస్థాయి నీటి మట్టం :

590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 583.00 అడుగులు

ఇన్‌ఫ్లో : 93,113 క్యూసెక్కులు

అవుట్‌ ఫ్లో : 35,749 క్యూసెక్కులు

విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,151 క్యూసెక్కులు

కుడికాల్వ ద్వారా : 511 క్యూసెక్కులు

ఎడమకాల్వ ద్వారా : 4,287 క్యూసెక్కులు

ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు

వరద కాల్వకు : నిల్‌

ఖమ్మంలో దొరికిపోతామని..

సూర్యాపేటలో సంచలనం సృష్టించిన

బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025

- 8లో

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కట్టలు బలహీనంగా మారాయి. పలుచోట్ల లైనింగ్‌ లేకపోవడం, లైనింగ్‌ ఉన్నచోట ధ్వంసం కావడం, కాంట్రాక్టర్‌ అక్కడక్కడా చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయి. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 582.90 అడుగులకు (291.3795 టీఎంసీలు) చేరుకుంది. ఈ వరద ప్రవాహం వారం రోజుల పాటు కొనసాగితే నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిగా నిండనుంది. రెండు మూడు ర క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్వలకు కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ తరుణంలో సాగర్‌ ఎడమ కాలువ కట్ట పలుచోట్ల బలహీనంగా ఉండడంతో ఎక్కడ గండి పడుతుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. అదే జరిగితే నష్టం ఊహించని విధంగా సంభవించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పంట నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆధునీకరణ అంతంతే..

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆధునీకరణలో భాగంగా సీసీ లైనింగ్‌ కోసం 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 2009లో ప్రపంచ బ్యాంక్‌ నిధులు రూ.4444 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2010లో సాగర్‌ ఎడమ కాలువతోపాటు మేజర్లు, మైనర్ల ఆధునీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. సాగర్‌ ఎడమకాలువ ప్రారంభం నుంచి ఖమ్మం టేకులపల్లి వరకు, ప్రకాశం జిల్లా లింగంగుట్ల సర్కిల్‌ పరిధి వరకు, నూజివీడు సర్కిల్‌ పరిధి వరకు పనులను చేపట్టింది. అయితే నిధులు సరిపోకపోవడంతో పలుచోట్ల ప్రధాన కాలువతోపాటు మేజర్ల లైనింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. చాలా చోట్ల పనులు పూర్తి కాలేదు.

నాణ్యత లోపం వల్లే కాల్వకు గండ్లు

ప్రధాన కాల్వ ఆధునీకరణలో అక్కడక్కడా చేపట్టిన పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. పనుల్లో నాణ్యత లోపం కారణంగానే ప్రధాన కాల్వలకు గండ్లు పడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలో 2002, 2024లో కాల్వకు గండ్లు పడ్డాయి. ఆ తరువాత ప్రభుత్వం వాటి మరమ్మతులకు నిధులను కేటాయించింది. అయితే పడిన గండిని పూడ్చారే తప్ప మిగతా మరమ్మతు పనులను పూర్తి చేయలేకపోయారు. దీంతో నీటి విడుదల కొనసాగుతుండడంతో కట్టలు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.

2022లో నిడమనూరు మండలంలోని 32వ కిలోమీటరు వద్ద గండిపడింది. దీంతో 40 రోజులపాటు నీటి విడుదలను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 32.4 కిలోమీటరు వద్ద వేంపాడు బ్రిడ్జి సమీపంలో వంద మీటర్ల పరిధిలో సీసీ లైనింగ్‌ వేయలేదు. దీంతో ప్రధాన కాల్వ నీటి ప్రవాహ ఒత్తిడికి గురై కాల్వ కట్ట బలహీనంగా మారుతోంది. అలాగే అక్కడి యూటీ (కాల్వ కిందిగా వర్షం నీరు ప్రవహించేవి), ముప్పారం యూటీ, నిడమనూరు యూటీల్లో పలుచోట్ల నీరు లీకేజీ అవుతోంది. 31వ కిలోమీటరు వద్ద ముప్పారం బ్రిడ్జి వెంట కాల్వ సీసీ లైనింగ్‌ పగిలిపోయి.. ముక్కలుగా మారి కాల్వలో కొట్టుకుపోయింది. దీంతో కాల్వ కట్ట బలహీనంగా మారింది. ముదిమాణిక్యం మేజర్‌ వద్ద, బొక్కమంతులపాడు(బికెపహాడ్‌) వద్ద కట్ట ప్రమాదకరంగా మారింది.

న్యూస్‌రీల్‌

కాల్వ కట్టలు బలహీనం..

రైతుల్లో భయం.. భయం!

ఫ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల దెబ్బతిన్న ఎడమ కాల్వ లైనింగ్‌

ఫ మరమ్మతు పనుల్లోనూ కొరవడిన నాణ్యత

ఫ గడిచిన మూడేళ్లలో రెండు చోట్ల గండ్లు పడి తీవ్రంగా నష్టపోయిన రైతులు

ఫ ఇప్పుడూ అదే పరిస్థితి ఉండడంతో ఆందోళన చెందుతున్న రైతులు

మరమ్మతులకు రూ.44.78కోట్లు కేటాయించినా..

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని సాగర్‌ ఎడమ కాలువ పలుచోట్ల దెబ్బతినడంతో మరమ్మతుల కోసం గత ప్రభుత్వం రూ.44.78 కోట్లు కేటాయించింది. నల్లగొండ జిల్లాలో 1.89 కిలోమీటరు నుంచి 73.800 కిలోమీటరు వరకు రూ.15.78కోట్లు, సూర్యాపేట జిల్లాలో 74 కిలోమీటరు నుంచి 133 కిలోమీటరు వరకు రూ.29కోట్లు కేటాయించింది. అయితే కాంట్రాక్టర్‌ పనులను ఆలస్యంగా ప్రారంభించడంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు చేసిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికే ఆ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో పూర్తికాలేదు. నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమ కాలువపై 30 యూటీలు ఉండగా ఐదు యూటీల వద్దనే మరమ్మతు పనులను చేపట్టారు. మరోవైపు పలు చోట్ల సీసీ లైనింగ్‌, ఫ్లోరింగ్‌ కోసం తాజాగా రూ.30కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపారు.

2022లో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నిడమనూరు మండలంలోని 32వ కిలోమీటరు వద్ద గండిపడింది. వందల ఎకరాలు నీటి ముగిగాయి. గండి పూడ్చేందుకు 40 రోజులపాటు నీటి నిలిపివేశారు. ఆ సమయంలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు.

2024 సెప్టెంబరు 1వ తేదీన నడిగూడెం మండలంలో 132 కిలోమీటరు వద్ద కాలువ కాల్వ కట్ట బలహీనంగా ఉండటంతో భారీగండ్లు పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

కట్ట మరమ్మతులు చేపట్టాలి

మా గ్రామ సమీపాన ఉన్న ఎడమ కాల్వ కట్ట పలు చోట్ల లైనింగ్‌ దెబ్బతింది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. అధికారులు స్పందించి కట్టకు మరమ్మతులు చేపట్టాలి.

– సింగిరెడ్డి పుల్లారెడ్డి, రైతు,

రామాపురం, నడిగూడెం

నడిగూడెంలోనూ అదే పరిస్థితి

నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కట్టలు అధ్వానంగా మారాయి. 123 కిలో మీటరు నుంచి 132 కిలో మీటరు వరకు పలు చోట్ల లైనింగ్‌ దెబ్బతింది. కట్టలు కూడా బలహీనంగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు 132 కిలోమీటరు వద్ద కాల్వ కట్ట బలహీనంగా ఉండటంతో భారీ గండ్లు పడ్డాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంకా పలు చోట్ల కట్టలపై కంపచెట్లు పెరిగాయి. దీంతో రైతుల రాకపోలకు కూడా ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి తక్షణమే కాల్వ కట్టలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇద్దరు అరెస్ట్‌
1
1/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
2
2/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
3
3/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
4
4/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
5
5/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
6
6/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
7
7/8

ఇద్దరు అరెస్ట్‌

ఇద్దరు అరెస్ట్‌
8
8/8

ఇద్దరు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement